telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

నగరంలోని నీట మునిగిన ప్రాంతాల లో హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు

భారీ వర్షాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుండి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

దీంతో అధికారులు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు.

హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

సంగారెడ్డి, మెదక్ జిల్లాలను మంజీరా నది వరద వణికిస్తోంది. సింగూరు, మంజీరా బ్యారేజీల నుంచి మంజీరా నదికి భారీ వరద వస్తోంది.

నదీ పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు నది వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Related posts