telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ మనందరి ఆకాంక్ష అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం వైద్యా, ఆరోగ్య శాఖ పై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 2026 నాటికి ఏపీలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని వెల్లడించారు.

2047 నాటికి భారత్‌ జనాభా 162 కోట్లు దాటుతుందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

2047 నాటికి చైనా జనాభా 100 కోట్లే ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం కాపాడుకోవడం అతి ముఖ్యమని సూచించారు. దక్షిణాదిలో జనాభా క్రమంగా తగ్గుతోందని చెప్పుకొచ్చారు.

యూపీ, బిహార్‌ వల్లే జనాభా బ్యాలెన్స్‌ అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుతోందని తెలిపారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువ అని వివరించారు సీఎం చంద్రబాబు.

Related posts