మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం “కెఎస్100″.. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల కాగా , మంచి స్పందన దక్కించుకుని సినిమా పై అంచనాలను ఏర్పరుచుకుంది.. కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.. ఈనెలలో సినిమా ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ” కెఎస్100″ చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి..ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. ఈనెలలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు” అన్నారు.. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..
నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
మాటలు- కథనం-దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్
నిన్ను ఎప్పటికీ మరచిపోలేను : మంచు విష్ణు