telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అదనపు భద్రత: ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ఉద్భవించిన ఉద్రిక్తతల నడుమ కీలక చర్య

బీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనందున ప్రభుత్వం పరంగా ఆయనకు నలుగురు గన్‌మన్‌లు ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ ఆయనకు అదనంగా మరో 14 మంది ప్రైవేటు గన్‌మన్‌లను నియమించింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు సైతం ప్రతి విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు, ప్రజలు ఉరికించి కొడతారని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి పార్టీ తరఫున పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Related posts