telugu navyamedia
ఉద్యోగాలు వార్తలు

భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు 02/2026 నోటిఫికేషన్ విడుదల – జూలై 11 నుంచి దరఖాస్తులు ప్రారంభం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. భారత వైమానిక దళం అగ్నివీర్‎ వాయు కోసం 02/2026 రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా యువతకు దేశ సేవలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 11, 2025 నుంచి ప్రారంభమవుతుంది.

జూలై 31, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 11, 2025
  • దరఖాస్తు చివరి తేదీ: జూలై 31, 2025
  • పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2025
  • దరఖాస్తు రుసుము
  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ: రూ. 550/-
  • దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.
  • వయస్సు పరిమితి
  • కనిష్ట వయస్సు: 17.5 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • పుట్టిన తేదీలు: జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు.
  • ఖాళీల వివరాలు
  • పోస్ట్ పేరు: అగ్నివీర్ వాయు (ఇన్‌టేక్ 02/2026)
  • విద్యార్హతలుఈ రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 10+2 (ఇంటర్మీడియట్)లో గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం 50% మార్కుల్లో ఇంగ్లీష్‌లో 50% మార్కులు సాధించాలి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఐటీలో 3 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి.

    వొకేషనల్ కోర్సు

    • ఫిజిక్స్, గణితం నాన్-వొకేషనల్ సబ్జెక్టులుగా ఉన్న 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు.
    • మొత్తం 50% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులు సాధించాలి.
    • అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

    దరఖాస్తు విధానం

    అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/ ద్వారా జూలై 31, 2025 లోపు అప్లై చేసుకోవాలి.

    ఎంపిక విధానం

    • అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉన్నాయి
    • ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష రాయాలి.
    • పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు
    • ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ I: మానసిక సామర్థ్యం పరీక్ష
    • అడాప్టబిలిటీ టెస్ట్ II: సమూహ చర్చలు, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు
    • మెడికల్ ఎగ్జామినేషన్: వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి
    • ఫైనల్ మెరిట్ లిస్ట్: అన్ని దశలలో పనితీరు ఆధారంగా తుది జాబితా తయారు చేయబడుతుంది
    • ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి ఏడాదిలో నెలకు రూ. 30,000, రెండో సంవత్సరం రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు అందిస్తారు.

Related posts