మాలీ దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పశ్చిమ, మధ్య మాలీలోని పలు మిలటరీ, ప్రభుత్వ స్థావరాలపై దాడులు చేశారు.
ఈ నేపథ్యంలోనే కయెస్లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
ఆయుధాలతో బెదిరించి ముగ్గురు భారతీయుల్ని ఎత్తుకెళ్లిపోయారు. అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న జమాత్ నుశ్రత్ అల్ ముస్లిమిన్ (JNIM) ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అపహరించిన ముగ్గురు భారతీయుల్ని ఎక్కడికి తీసుకెళ్లారు?.. ఏం చేశారు? అన్నది తెలియరాలేదు. స్థానిక ప్రభుత్వం వారిని క్షేమంగా తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక, ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారిని క్షేమంగా విడిపించాలని మాలీ ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది.
బమకోలోని భారత ఎంబసీ అధికారులు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఈ సంఘటనపై మాలీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో..‘జులై 1వ తేదీన పశ్చిమ, మధ్య మాలీలోని పలు మిలటరీ, ప్రభుత్వ స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ దారుణాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అపహరణకు గురైన వారిని క్షేమంగా విడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
సీనియర్ మిలటరీ అధికారులు పరిస్థితులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. ఆ ముగ్గురు భారతీయుల్ని వీలైనంత త్వరగా.. క్షేమంగా ఉగ్రవాదుల చెరనుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొంది.
వపన్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్: షర్మిల