telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

29 వ తేదీ ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 29-03-2025 వ తేదీ ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి పుష్పాంజలి ఘటించి 43 వ పార్టీ ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు.

ఈ వేడుకలలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారు.

ఈ 43 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలపై నాయకులు ప్రసంగిస్తారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ కార్యక్రమాన్ని ప్రకటించారు

Related posts