కృష్ణా -గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544 చెల్లని ఓట్లు 26, 676 కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
ఈ సందర్భంగా ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు అపూర్వ విజయమని అన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లు ముందుగానే డిసైడయ్యారని ఆయన అన్నారు.
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని ఆలపాటి రాజా అన్నారు.
వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.
తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదుటివారిపై బురదచల్లే విధంగా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. తనకు మెజారిటీ వచ్చినన్ని ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు.
పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీలా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనకు ఓటు వేయడం గర్వకారణంగా ఉందన్నారు. నిత్యం తాను ప్రజలలో ఉండే వ్యక్తినని ఆలపాటి రాజా పేర్కొన్నారు
రాష్ట్రంలో రివర్స్ పాలన.. వైసీపీపై చంద్రబాబు ఫైర్