తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటారు.
రాత్రి తిరుమలలోని వకుళా మాత అతిథి గృహంలో ఆయన బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు.
మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది.
మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉండటంతో తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకునేందుకు అమిత్ షా వస్తున్నట్లు సమాచారం. ఈసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయి హ్యాట్రిక్ కొడతారని మొదటి నుంచి బీజేపీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు.
సీపీఐ, సీపీఎంలు పార్టీ సిద్ధాంతాలను అమ్ముకున్నాయి: బీజేపీ నేత