ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్ ‘పుష్ప-2’. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది. ‘పుష్ప పుష్ప’ సాంగ్, స్టెప్ బాగా వైరల్ అయింది.
ఇప్పుడు రెండో పాటను కూడా చిత్రం యూనిట్ తాజాగా విడుదల చేసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ పాటకు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించగా, లిరిక్స్ చంద్రబోస్ రాశారు. శ్రేయా ఘోషల్ పాడారు.
అల్లు అర్జున్ మరియు హీరోయిన్ రష్మిక మందన్న పై చిత్రీకరించిన ఈ పాట, సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి భారీ వసూళ్లతో అదరగొట్టిన బన్నీ.. నేషనల్ అవార్డు సాధించాడు. ఇప్పుడు ‘పుష్ప-2’తో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.