ఉత్తరప్రదేశ్ లోని అమేఠీ, రాయ్బరేలీకి కాంగ్రెస్ ఈ ఉదయం అభ్యర్థులను ప్రకటించింది.
ఇప్పటివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన వెంట సోనియా, ప్రియాంక గాంధీ ఉన్నారు. అటు అమేఠీ నుంచి కిశోరీ లాల్ శర్మ నామినేషన్ సమర్పించారు.
ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు నేడే ఆఖరితేదీ.
ఈ స్థానాల్లో చివరి వరకూ సస్పెన్స్ కొనసాగించిన కాంగ్రెస్.. నేడు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈసారి రాహుల్ అమేఠీని వదిలి రాయ్బరేలీకి మారడంపై భాజపా నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వీటిని హస్తం పార్టీ తిప్పికొట్టింది. తామేమీ భయపడటం లేదని, పార్టీ వ్యూహాల్లో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపింది.

