నాలాలు అన్యాక్రాంతం కాకుండా, నాలాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జిహెచ్ఎంసి నాలా భద్రత కు చర్యలు చేపట్టింది. గత సంవత్సరం లాగానే ఈ వర్షాకాలంలో కూడా నాలా భద్రత ఆడిట్ ను చేపట్టేందుకు జిహెచ్ఎంసి పటిష్టమైన చర్యలు చేపట్టింది. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకునేందుకు సర్కిల్ వారీగా నాళాల స్కెచెస్ ను నిర్ధారించి ఒక్కొక్క స్కెచెస్ కు ఒక ఏఈ గానీ డిప్యూటీ ఈఈ లను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించడంతో సంబంధిత ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఇ.ఎన్.సి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో అట్టి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ లు, ఇ.ఇ లు ఒక్కొక్క స్కెచెస్ కు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమిస్తూ వారు తీసుకోవాల్సిన చర్యలను నిర్లక్ష్యం లేకుండా చిత్త శుద్ధి తో విధులు చేపట్టాలని ఆదేశించారు కేటాయించిన స్కెచెస్ లో పూడికతీత, ఇతర లోపాలను గుర్తించి ఏమైనా మిస్సయిన నాలాల పూర్తి వివరాల నివేదిక ను ఈ నెల చివరి వరకు అందజేయాలన్నారు. అంతే కాకుండా ప్రహరీ గోడల పునరుద్ధరణ, చైన్ లింక్, ఫెన్సింగ్, బ్యారికేడ్లు, ఓపెన్ నాలా , డ్రైన్ ల ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డు లు, ప్రమాదాలు జరగకుండా సూచించే మార్క్ లు వాటి తో పాటు ఓపెన్ నాలా బాక్స్ డ్రెయిన్, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లలో కూడా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు.
వార్డులకు కేటాయించిన ఇంజనీరింగ్ ఆఫీసర్ లు స్ట్రామ్ వాటర్ డ్రైన్ లకు సంబంధించిన క్యాచ్ పిట్స్,బాక్స్ డ్రైన్ మ్యాన్ హోల్స్ కు దెబ్బ తిన్న, పనికి రాకుండా ఉన్న కవర్స్ వెంటనే రీ-ప్లేస్ చేయాలన్నారు. ఈ విషయంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం మూలంగా అవాంఛనీయ సంఘటనలు వలన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన పక్షంలో సంబంధిత అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. రోజువారిగా డి-సిల్టింగ్ వివరాలు ఫోటో తో అప్ లోడ్ (నమోదు) చేయాలి. ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు నాలాలో ప్రవహించే నీటి ప్రవాహం తెలుసుకునేందుకు వల్బారెబుల్ పాయింట్ ల వద్ద మీటర్ ఏర్పాటు తో పాటు ఫ్లోటింగ్ మెటీరియల్ ను కూడా ఎప్పటి కప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు. ఐ.ఆర్.టి వర్కర్ల రోజు వారి అటెండెన్స్ తో పాటు వారు తీసిన డి- సిల్టింగు ను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకుంటారు.
సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.