telugu navyamedia
తెలంగాణ వార్తలు

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం : శాంతించాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్ర‌స్తుతం  భద్రాచలం వద్ద ప్రవాహం  70.70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది.ఇప్పటికే 95 గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలంలో చాలా వరకు కాలనీల్లోకి వరద నీరు చేరింది.

ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మ శాంతించాలంటూ పుష్కర స్నానఘట్టాల  వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు

భద్రాచలం నాలుగువైపులా వరద చుట్టుముట్టడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలా గోదారికి వరదలు రావడం 100ఏళ్ళ చరిత్రలో ఇదే మొదటి సారి అని అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఐతే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి అధికారులు ముందస్తుగానే సిద్దం అయ్యారు. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ధాటికి అన్ని నదులు పొంగిపొర్లుతున్నాయి.

దీనికితోడు తెలంగాణలోని కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు లాంటి స్థానిక ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నది పైన నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో, దాదాపు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగుల ప్రమాద స్థాయికి చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

 

Related posts