telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏక్‌నాద్ షిండేలను సృష్టిస్తారా.? తమాషాగా ఉందా.? కేంద్రంపై సీఎం కేసీఆర్ ధ్వజం

*రేప‌టి నీతి ఆయోగ్ స‌మావేశాలు బ‌హిష్క‌రిస్తున్నాం..
*నీతి ఆయోగ్‌ మీటింగ్‌లు భ‌జ‌న బృందాలుగా మారాయి..
*సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌
*అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోయింది
*ఏక్‌నాద్ షిండేలను సృష్టిస్తారా.? తమాషాగా ఉందా.?
*గాలికి త‌ప్పా అన్నింటిపై జీఎస్టీ వేశారు..
*ప్ర‌ధాని మోదీ మంచి మిత్రుడు..వ్య‌క్తిగ‌త విభేదాలు లేవు..
*నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు పోరాడుతా..
*బ‌ల‌మైన రాష్ర్టాలు ఉంటేనే బ‌ల‌మైన దేశం ఉంటుంది..

నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడం లేదని, భజన మృందంగా మారిందని సీఎం కేసీఆర్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అందుకు నిరసనగా.. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా బాధాకరమే అయినప్పటికీ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు వివరించారు..

దేశంలో త్వరలో ఏకస్వామ్య పార్టీనే ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారని, ఇదేనా మీ ఫెడరలిజం అంటూ తూర్పారబట్టారు. ఇదేనా టీమ్ ఇండియా, ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని, రేపటి రోజున ఇవే మిమ్మల్ని కబళిస్తాయని బీజేపీని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? తమాషాగా ఉందా? అంటూ ఫైర్ అయ్యారు.

జాతిపితను , అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని అవమానపరుస్తారా? అని ధ్వజమెత్తారు కేసీఆర్​. మహత్మాగాంధీని పూజించే వాళ్లు, గాంధీ వంశం అని చెప్పుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారని తెలియజేశారు సీఎం కేసీఆర్​.

దేశ చరిత్రను మలినం చేస్తున్నారని, మహాత్మా గాంధీకి లేని అవలక్షణాలను అంటగడుతున్నారని ధ్వజమెత్తారు

ఎవరైనా దేశంలో వాళ్ల చరిత్రను వాళ్లే మలినం చేసుకుంటారా? ఆటవిక సమాజమా? అనాగరికతనా ఇది? అని ప్రశ్నించారు కేసీఆర్​. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అని ప్రశ్నించారు. ప్రధాని ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని హితవుచెప్పారు.

ప్లానింగ్‌ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్‌ తీసుకొచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. 8 ఏళ్ల నీతి ఆయోగ్‌ సాధించింది ఏం లేదని విమర్శించారు. రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రమే అడ్డుకుంటోందని మండిపడ్డారు. టీం ఇండియా పేరుతో ముఖ్యమంత్రులందరితో చర్చించి అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేశారని.. కానీ నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. రూపాయి విలువ పడిపోయింది.. నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.. ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చించడం లేదని.. దేశంలో నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయింది.. నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడంలేదు.. అదో భజన బృందంగా మారిపోయిందని విమర్శించారు. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రతీ అంశంపై విస్తృత చర్చ జరిగేదన్నారు.

రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు అసలు భాగస్వామ్యమే లేకుండా పోయిందని కేసీఆర్ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో అసలు ఉపయోగపడే చర్చలే లేవన్నారు. అందులే పాల్గొనే ముఖ్యమంత్రులకు మాట్లాడేందుకు కొన్ని నిమిషాల సమంయ కూడా కేటాయించడం లేదని కేసీఆర్ గుర్తు చేశారు.

అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోయిందని అన్నారు. దేశ భవిష్యత్తు రోజురోజుకు ప్రమాదంలో పడుతోందన్నారు. కూర్చున్న కొమ్మను తామే నరుకున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

 

Related posts