telugu navyamedia
ఆరోగ్యం

భారత్​లో ఆగని కరోనా ఉధృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,038 మంది వైరస్​ బారిన పడగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 4,17,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరింది.

దేశంలో క‌రోనా​ నుంచి తాజాగా 18,301 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.32 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా ఉంది.

గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 53 మంది మరణించారు. దేశంలో కొవిడ్ తో మృతిచెందిన వారి సంఖ్య 5,25,660కి చేరాయని, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

భారత్​లో శుక్రవారం 22,93,627 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,71,61,438కు చేరింది. మరో 4,17,895 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

 

 

Related posts