*బేగంపేటకు చేరుకున్న యశ్వంత్ సిన్హా..
*యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికి సీఎం కేసీఆర్,కేటీఆర్, ఇతర నేతలు
*హైదరాబాద్లో టీఆర్ ఎస్, బీజేపీ పోటా పోటీగా జెండాలు
*తెలంగాణలో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు
*హైదరాబాద్లో యశ్వంత్ సిన్హాను కలవద్దని టీపీసీసీ నిర్ణయం
*యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన వీహెచ్..
రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఘనంగా స్వాగతం పలికారు.
బేగంపేట్ నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వరకు 10వేల మంది కార్యకర్తలతో పాటు నేతలు కూడా భారీ ర్యాలీ గా బయలుదేరారు.. అనంతరం జలవిహార్లో యశ్వంత్ సిన్హాతో టీఆర్ ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.
సమావేశం ముగిసన తర్వాత కేసీఆర్తో కలిసి భోజనం చేస్తారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు. సాయంత్రం 4.20 గంటలకు బెంగుళూరుకు పయనమవుతారు.
కాగా.. హైదరాబాద్లో యశ్వంత్ సిన్హాను కలవద్దని టీపీసీసీ నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బేగంపేట ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు.
మరో వైపు నగరంలో ఎక్కడ చూసినా గులాబీ, కషాయి జెండాలో కనిపిస్తున్నాయి.బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది.