కోలీవుడ్ ప్రముఖ హీరో దళపతి విజయ్ , దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ వారసుడు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.
ఈరోజు విజయ్ బర్త్ డే కానుకగా నిన్న సాయంత్రమే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ కూడా విడుదల చేసింది.
ఈ సెకండ్ లుక్లో విజయ్.. చూట్టూ పిల్లలు ,పండ్లు, కూరగాయలు ,చెరుకు గడలు ఉన్న ఎండ్ల బండిలో పడుకుని ఎక్కడికో బయలుదేరినట్టుగా కనిపిస్తున్నాడు . ‘ది బాస్ రిటర్న్స్ ‘ అంటూ క్యాప్షన్ జోడించింది.. కాగా విజయ్ కొత్తలుక్ పలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలకానుంది.
విజయ్ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిదే. ఆయన హీరోగా గతంలో తెరకెక్కిన ‘తుపాకి’, ‘సర్కార్’, ‘విజిల్’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ తదితర చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది.
Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay
Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488
— Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022
ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ ఫైర్