telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డార్లింగ్స్ రేపు మీకు సర్ప్రైజ్ : ప్రభాస్

Prabhas

“బాహుబలి”తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం “సాహో”. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న “సాహో” చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. “హాయ్ డార్లింగ్స్… ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి” అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. దీంతో “డార్లింగ్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏంటా?” అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు ఫేస్‌బుక్ మాత్రమే వాడే ప్రభాస్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. మరి డార్లింగ్ రేపు అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఏంటో చూడాల్సిందే.

Related posts