ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (ఏప్రిల్ 8న) 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. బన్నీ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ సెలబ్రెటీల బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు.
ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బన్నీకి తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బన్నీ… వర్క్ పట్ల నువ్వు చూపించే పట్టుదల, అంకితభావం.. కష్టపడేతత్త్వమే నిన్ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. ఈ పుట్టిన రోజును ల్యాండ్‌మార్క్ బర్త్‌డేగా మార్చుకో’ అంటూ చిరు క్రేజీగా విషెస్ తెలిపారు.
చిరు చేసిన ట్వీట్‌పై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు లైక్స్, రిట్వీట్స్ రూపంలో తమ రియాక్షన్స్ తెలియజేస్తున్నారు. అలా, కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, అల్లు అర్జున్ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడే ఆయన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
Happy Birthday Bunny @alluarjun 🎂 Your hard work & focus gives you success. Party hard & make this landmark birthday memorable. 🎉
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2022