సీపీఐ నేత నారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన పవన్ అటు ఇటు కాకుండా తలతిక్కగా మాట్లాడారంటూ విమర్శించారు. రాజకీయంగా కన్ఫ్యూజన్లో ఉన్న పవన్…. క్యాడర్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని సెటైర్లు వేశారు.
యువత శక్తిని నిర్వీర్యం చేయొద్దు అని సూచించిన ఆయన.. కానీ, పవన్ కళ్యాణ్ అంటే మాకు వ్యతిరేకత లేదు.. మీ విధానాలు, మీ నిలకడలేని తనానికే మేం వ్యతిరేకత తెలియజేస్తున్నాం అన్నారు.
మరోవైపు, ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు నారాయణ.. ఇప్పటివరకూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు దందాలతో బీజీగా ఉన్నారన్న ఆయన.. కనీసం, ఇప్పటికైనా సీఎం జగన్ వారి పద్ధతిని మార్చుకోమని చెప్పడం స్వాగతిస్తున్నాం అన్నారు.. జగన్ కేబినెట్లో వింత జంతవులాంటి వారున్నారని ఎద్దేవా చేశారు..
జగన్ సొంత లిక్కర్ని తయారు చేసి ప్రమోట్ చేసుకునే పద్ధతిని తీసుకొచ్చారని విమర్శించారు.. కల్తీ మద్యంతో మరణించిన వారంతా జగన్ కిరాతకానికే బలయ్యారని ఆరోపించారు.. ఇవన్నీ మరణాలను సర్కార్ హత్యలుగానే భావించాలన్నారు నారయణ.
ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల