ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయింది. దీనిలో భాగంగా జనవరి 2వ తేదిన కృష్ణా జిల్లాలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. 7న ఉభయగోదావరి జిల్లాలతో పాటు కడపలోనూ ఈ పథకం ప్రారంభం కానుంది. జనవరి 20వ తేదీ నుండి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అమల్లోకి తీసుకురానున్నారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ బుకింగు విధానంలో స్టాకు రెండు మూడు నిముషాల్లోనే అయిపోతోందని, దళారుల పాత్ర ఎక్కువగా ఉంటోందని అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇక నుండి ఇంటికే ఇసుకను పంపించడంతోపాటు, ఆన్‌లైన్‌లో ఉన్న ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వినియోగదారులకు ఇబ్బందులు ఉండకూదని, రానున్న సీజన్లో భవన నిర్మాణాలకు సజావుగా ఇసుక సరఫరా జరిగేలా చూడాలని చెప్పారు.
సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకూ 43.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేశామని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి సిఎంకు వివరించారు. రోజువారీ సగటు వినియోగం 80 వేల టన్నులు ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అదనంగా స్టాక్ పాయింట్లలో 9.63 లక్షల టన్నులు ఉందని వివరించారు. డోర్ డెలివరీకి సంబంధించిన రుసుంను ఎపిఎండిసి వసూలు చేస్తుందని వివరించారు. అలాగే ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 389 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, జనవరి 9వ తేదీలోగా చెక్‌పోస్టులు పూర్తవుతాయని వివరించారు. వీటికి సంబంధించి సిఎం క్యాంపు కార్యాలయం, ఎపిఎండిసిలో కమాండ్ కంట్రోలు రూమలు ఉంచాలని సిఎం ఆదేశించారు. దీంతోపాటు ఇబ్బందులు లేకుండా నెలకు 15 లక్షల టన్నులు సరఫరా చేసేందుకు వీలుగా రానున్న నాలుగు నెలల్లో 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లలో పెడతామని మంత్రి సిఎంకు వివరించారు.
రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతారు…