ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లు గత కొన్ని రోజులుగా హ్యాక్‌కు గురవుతుండగా,.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాక్‌కు గురై అయింది.
బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్లో తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్లోకి వెళ్లడంతో వెంటనే ఖాతాకు భద్రత కల్పించినట్లు ప్రధాని కార్యాలయం(PMO) తెలిపింది. ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్లు పోస్టులు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని పేర్కొంది.
అయితే గతంలో మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే.దీనిపై పీఎంవో అధికారులు వెంటనే స్పందించి ట్విటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ట్విటర్ అకౌంట్‌ను రీస్టోర్ చేశారు.
73 మిలియన్లకు పైగా వ్యూవర్స్ కలిగి ఉన్న ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాక్ చేయబడిన తర్వాత స్క్రీన్షాట్లను చాలా మంది వినియోగదారులు పంచుకున్నారు.


వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ