మేషరాశి..
ఒక ముఖ్యమై వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.అనుకున్న ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. విద్యార్థులు మొండివైఖరి వల్ల మాటపడక తప్పదు.
వృషభరాశి..
అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికమవుతాయి. అనారోగ్యం భాదిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.
మిథునరాశి..
ముఖ్య పనులను మొదలుపెట్టడానికి అనుకూలమైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడతాయి. బంధువులు నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఎదురవుతాయి.
కర్కాటకరాశి..
విద్యార్థినులకు ప్రతి విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
సింహరాశి..
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడతాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. నూతన ఒప్పందాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.
కన్యరాశి…
కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు ఏర్పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి.
తులరాశి..
ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. దైవదర్శనాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి అవుతుంది.
వృశ్చికరాశి..
హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో ఒత్తిడులు ఎక్కువవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. మంచి ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది.
ధనుస్సురాశి..
వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీవ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడి ఉండదు.
మకరరాశి..
అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.
కుంభరాశి..
మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడతాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వృత్తి వ్యాపారులకు సంతృప్తి నిస్తాయి.
మీనరాశి..
తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు రేకెత్తుతాయి.