telugu navyamedia
సినిమా వార్తలు

బంగార్రాజు నుంచి ‘నా కోసం’ లిరికల్‌ సాంగ్ విడుద‌ల‌..

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ప్రీక్వెల్ గా వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Naga Chaitanya's Bangarraju Movie Naa Kosam Lyrical Song Released Today -  Patachalgaya

తాజాగా ఈ చిత్రం నుండి ‘నా కోసం’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ప్రేయసి కోసం ప్రియుడు తనని తాను ఎలా మార్చుకున్నాడో ఈ పాట చెబుతోంది. నాగ చైతన్య, కృతి శెట్టి, మధ్య మంచి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి కనిపించి అలరించారు.

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అభిమానుల్ని, ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సి, అనిత చౌదరీ, రోహిణి, ప్రవీణ్, పద్మ సూర్య, రంజిత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Related posts