మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాటా ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ను వదిలారు మేకర్స్ . ప్రతీ ఒక్కడి కలలో కష్టాలు కన్నీలు ఉంటాయి. “కోరికలు ఉంటాయి. కోపాలు ఉంటాయి. కనబడితే గొడవలు ఉంటాయి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ ఛాంపియన్ కావాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే… ఆ ఒక్కడివి నువ్వే ఎందుకు అవ్వాలి. వై యూ? ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు” అంటూ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన డైలాగ్ కేక పెట్టించేలా ఉంది.
ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.