యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా లోని రెండో సాంగ్‌ను నవంబర్ 10న విడుదల చేయనుంది చిత్రబృందం.
భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, దీపావళి కానుకగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ నందమూరి, మెగా అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.
తాజాగా దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ను ఇస్తామంటూ.. ట్విట్టర్ వేదిక చిత్ర యూనిట్ ప్రకటించింది. చెప్పిన విధంగానే శుక్రవారం నాటు నాటు ..నాచో నాచో అంటూ సాగే పాటను ‘బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న’ అంటూ సెకండ్ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
ఈ పోస్టర్లో ఎన్టీఆర్, రామచరణ్ స్టెపులేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ.. ఇద్దరు కలిసి ఒకే పాటలో స్టెప్పులేస్తే.. ఇంకేముంది. ఫ్యాన్స్‌కు ఫుల్ పండగే..
ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందిస్తున్నారు.