telugu navyamedia
సినిమా వార్తలు

పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్ద‌న్న’ పేరుతో రాబోతుంది. యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్ర‌దాన పాత్రలు పోషిస్తున్నారు.

రజినికాంత్ పెద్దన్న'.. రన్ టైం షాక్..

తాజాగా ఈ సినిమా టీజర్‌ని విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశాడు.‘పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజనీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ `పెద్దన్న` టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ -  IndustryHit.Com

ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలో విడుద‌ల కానుంది.

Related posts