telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ చిత్ర పరిశ్రమ ..

రెండు రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన “రిపబ్లిక్ ” సినిమా కార్యక్రమంలో వై .సి .పి పార్టీని , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యలో తెలుగు సినిమా రంగం ఉలిక్కిపడింది.

వ్యక్తిగతంగా ఎందరో ఏవేవో మాట్లాడుతూ ఉంటారని , వారి అభిప్రాయాలూ , విమర్శలతో సినిమా రంగానికి సంబంధం లేదని ఒక ప్రకటన చేసింది . ఇటీవల తెలుగు సినిమా రంగ ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఫలవంతమైన చర్చలు జరిపిన విషయాన్ని ఈ సందర్భగా గుర్తు చేశారు .

Pawan Kalyan's explosions at Republic Pre Release function

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ ప్రభుత్వాల సహాయ , సహకారాలు సినిమా రంగానికి ఎంతో అవసరమని ,రెండు ప్రభుత్వాలు తమకు రెండు కళ్ళు వంటి వని తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నాయణదాస్ కృష్ణదాస్ నారంగ్ పేర్కొన్నాడు .

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వీరు భావించడంతో వెంటనే నష్టనివారంగా పవన్ ప్రకటనతో తమకు సంబంధం లేదని ప్రకంటించింది.

Related posts