telugu navyamedia
ఆరోగ్యం

మీరు అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్నారా?

చాలా మంది రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కోంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధితో మరణించే ప్రమాదం కూడా ఎక్కువ. మారుతున్న జీవన శైలి, ఆనారోగ్య అలవాట్లు, మానసిక ఆందోళన, అధిక ఒత్తిడిల కారణంగా ఈ అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

అలాగే ధూమపానం, మద్యం అలవాటు, ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, రోజుకు కనీసం అరంగట అయినా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

Help Lower Blood Pressure With These Foods and Drinks - The Daily Meal

రక్తపోటును అధిగమించాలంటే ఆహార నియమాలపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. రోజువారి ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్దాలను తీసుకోవాలి. తక్కువ మోతాదులో సోడియం ఉన్న ఆహారపదార్దాలను తీసుకోవడం వలన రక్తపోటును హెచ్చుతగ్గులు కాకుండా నియంత్రించవచ్చు.

మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు..అవేంటో ఇప్ప‌డు చూద్దాం:-

* పెరుగు
పెరుగులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఉండటం వల్ల ఇవి శరీరంలో ఫ్యాట్ తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నిత్యం ఎవరైతే పెరుగు తప్పనిసరిగా తింటారో వారికి అధిక రక్తపోటు సమస్య ఉండదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

High blood pressure diet: Prevent hypertension symptoms with yogurt | Express.co.uk

*అరటి పండ్లు
ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొటాషియం సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే రక్త నాళాల పొరలను ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

High blood pressure diet: Prevent hypertension symptoms and signs with bananas | Express.co.uk

*చేపలు
కొవ్వు చేలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కొవ్వులు రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వాపు, ఆక్సిలిపిన్స్, రక్తనాళాలు సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అలాగే తక్కువ రక్తపోటు స్థాయిలతో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Eating grilled or well-done meat, fish tied to high blood pressure risk, says study

*గుమ్మడి కాయ గింజలు
గుమ్మడి కాయ గింజలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ గింజలలో పోషకాలు అనేకం ఉంటాయి. ఇది మెగ్నీషియం, పొటాషియం, అర్జినిన్ కలిగి ఉంటుంది. ఇవన్నీ రక్తపోటు తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడానికి రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలు లేదా గుమ్మడికాయ నూనెను తీసుకోవడం ఉత్తమం.

Benefits Of Pumpkin Seeds For Hair - Boldsky.com

*యాపిల్స్ 
యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ మూడు విభిన్న సబ్ క్లాస్ ఉన్నాయి. ఫ్లేవొనోల్స్, ఫ్లేవోన్స్, ఫ్లేవనోల్స్. ఇవి సహజ పదార్ధాలతో సమృద్ధిగా ఉండి రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.

Beating High Blood Pressure with Food - Harvard Health Publishing - Harvard Health

*ఆరెంజ్‌
100 గ్రాముల నారింజలో దాదాపు 19.6 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్‌ల ఆగ్లైకోన్‌లు ఉంటాయి. ఒక రోజులో తాజాగా పిండిన ఆరెంజ్ తీసుకోవడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

High blood pressure: Lower your reading with a daily dose of this zesty fruit | Express.co.uk

*స్ట్రాబెర్రీలు
బెర్రీలు కొన్ని రకాల ఫ్లేవనాయిడ్‌లకు గొప్ప మూలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు తినడం ద్వారా ఆంథోసైనిన్, కాటెచిన్, క్వెర్సెటిన్, కెంఫ్‌ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు లభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా సహాయపడి.. అధిక రక్తపోటు నుంచి కాపాడేందుకు ఉపయోగపడతాయి.

Health Benefits of Strawberry: 7 Reasons to Include Strawberries in Your Diet | India.com

*రెడ్ క్యాబేజీ
రెడ్‌ క్యాబేజీలో సైనైడింగ్, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ప్రధాన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లుగా ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

8 Impressive Benefits of Purple Cabbage

*బీన్స్, పప్పులు
బీన్స్, పప్పులలో ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ బీన్స్, పప్పులు తినడం వలన రక్తపోటును తగ్గిస్తాయని అధ్యాయనాల్లో తేలింది. 8 అధ్యయనాల సమీక్షలో బీన్స్, పప్పులు ఇతర ఆహారాల కోసం మార్పులు చేసినప్పుడు రక్తపోటుతో బాధపడుతున్న ప్రజలలో సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని కనుగొన్నారు.

High blood pressure symptoms hypertension risk lowered lentils to diet | Express.co.uk

Related posts