నిత్యం కాంట్రవర్సీలతో టైమ్ పాస్ చేసే వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ..ఎప్పుడేం చేస్తాడో.. దేని గురించి ఎలా స్పందిస్తాడో ఆయనకే తెలియని ప్రశ్న. ఆర్జీవీ ట్వీట్ చేశాడంటే.. అది కచ్చితంగా వైరల్ కావాల్సిందే.

పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేసే విధానమే కొత్తగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కామెంట్లతో టార్గెట్ చేస్తాడో వర్మకే తెలియదు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఏకంగా అషూ రెడ్డి ప్రైవేట్ పార్ట్‌ను వాడేశాడు.

ఈ మధ్య బుల్లితెర బుల్లెమ్మలతో ఆర్జీవీ చేసిన రచ్చ మామూలుగా లేదు. బిగ్ బాస్ హౌజ్ మేట్ ఆరియానా గ్లోరీకి బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఆ టైమ్ లో డిఫరెంట్ యాంగిల్ లో ఫొటో తీసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

ఆ వీడియో కాస్త ఇప్పుడునెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పిచ్చిపిచ్చిగా అభిమానించే అషూ రెడ్డి ఎద భాగం మీద పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకుంది.. దీన్ని ఆర్జీవీ వాడేసుకున్నాడు. ఆ టాటూ గుట్టు విప్పుతూ పవన్ కళ్యాణ్‌కు తన స్టైల్లో వర్మ విషెస్ చెప్పాడు.అషూ రెడ్డి నుంచి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 సాయంత్రం ఆరుగంటల తొమ్మిది నిమిషాలకు ఇంటర్వ్యూ ప్రోమోను వదులుతున్నాను.. జై పవర్ స్టార్..జై జై అషూ రెడ్డి అంటూ తన స్టైల్లో పోస్ట్ చేశాడు.
అయితే.. పవన్ కల్యాణ్ మీద అభిమానాన్ని వ్యక్తపరుస్తూ అషూ రెడ్డి ఆయన పేరును నడుము పైభాగంలో.. ఎద అందాల మీద టాటూ వేయించుకొని ఫొటో దిగింది. ఆ ఫొటోను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కింద కామెంట్లు చేస్తున్న వారికి అషూ రెడ్డి తనదైన స్టైల్లో సమాధానం ఇస్తోంది. అయితే ఈ మధ్య అషూ రెడ్డి ఆర్జీవీ మధ్య జరుగుతున్న వ్యవహారం నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే.


