telugu navyamedia
సినిమా వార్తలు

PSPK 28: జాతర షురూ ..మళ్లీ లోడింగ్’..

PSPK 28: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌‌డేట్స్‌తో ప్రేక్షకాభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

Pawan

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమానుంచి కూడా అప్డేట్ వచ్చింది. మొగలాయిలా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ మూవీ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఇలా వరుస సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి.

Pawan Kalyan and Harish Shankar film first shot on Vijaya Dashami - tollywood

తాజాగా మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. పవన్‌తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న 28వ చిత్రమిది.

ఈ పోస్టర్‌లో ‘జాతర షురూ.. మళ్లీ లోడింగ్’.. అంటూ హార్లీ డేవిడ్‌సన్ డీలక్స్ బైక్‌పై స్టైలిష్‌గా పవన్ కూర్చొని గన్ పట్టుకొని ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ వెనక ఇండియా గెట్‌ను చూపించారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

మరో సారి పవన్‌తో హరీష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం నెట్టింట ఈ లుక్‌ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం పవన్‌ చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారు.

Related posts