అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్ తో కలిసి వార్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో సైనికుడిగా కనిపించడానికి చైతన్య తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేశాడు. తాజాగా నాగ చైతన్య పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో చైతన్య లుక్ ఆకట్టకుంటుంది.
ఇక తెలుగులో నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పుడు నాగచైతన్య ఖాతాలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రానున్న ఓ వెబ్ సిరీస్, మరో వెబ్ మూవీ ఉన్నాయి.