పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న.. ఈ సినిమాను ప్రస్తుతం ప్రొడక్షన్ నెం 12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పవన్, రానా ఫస్ట్‌లుక్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మూవీ టైటిల్‌పై ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ మేకర్స్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. . ఈ మేరకు మల్టిస్టారర్‌కు ‘భీమ్లా నాయక్’ అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
అందులో భీమ్లా నాయక్… వస్తున్నాడు అంటూ లేటెస్ట్‌గా రిలీజైన గ్లిమ్స్ వీడియో… పవన్ ఫ్యాన్స్‌ని ఎలెర్ట్ చేసింది. ఈ ఫస్ట్ గ్లింప్స్ ‘ఒరేయ్ డేనీ.. బయటకు రారా’ అంటూ పవన్ ఫైట్‌తో స్టార్ట్ కాగా.. కొత్తగా లుంగీ కట్టడం, బ్లాక్ షర్ట్ విలన్లను చితక్కొట్టడం తో ఇచ్చిన పవన్ ఎంట్రీ అభిమానుల చేత కేక పెట్టించేలా ఉంది. ‘డేని.. డేనియల్ శేఖర్’ అని రానా తన పేరు చెప్పగానే.. ‘భీమ్లా..భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా!! అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవర్‌స్టార్ వేసిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
కాగా.. ఫైటింగ్ లో హీరో దుమ్మురేపడమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ కూడా అదరగొట్టేశాడు. అందరూ అనుకుంటున్నట్టుగానే సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులోనూ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో.. భీమ్లా నాయక్ గ్లిమ్స్‌తో అంచనాలకు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు.
మా ప్రెసిడెంట్‌ని నాకూ ఏం చెప్పలేదు… బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ రియాక్షన్