మహబూబాబాద్ జిల్లాలోని మహిళా ట్రైనీ ఎస్సై జరిగిన లైంగిక వేధింపులు కలకలం రేపుతోన్నాయి. గత రాత్రి తనను అటవీప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని బాధితురాలు ఆరోపిస్తోంది .
కుటుంబ సభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించింది. అనంతరం, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు మేరకు SI శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం SI శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా..వరంగల్ సీపీ పరిధిలో పోస్టింగ్ తీసుకున్న సదరు ట్రైనీ ఎస్సై. ఎస్ హెచ్ ఓ లున్న పోలీస్ స్టేషన్‌లో నెల రోజులు ప్రొహిబిషన్ పీరియడ్‌ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే SI ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తీవ్రంగా స్పందించారు.
జరిగిన సంఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి వెల్లడించారు.

