భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది.. సెకండ్ వేవ్ లో కరోనా ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు.. పురిగుడిసెలో ఉండేవారి నుంచి విల్లాలో ఉండేవారి వరకు.. అందిరినీ వెంటాడుతూనే ఉంది కరోనా.. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు కోవిడ్ బారిన పడగా.. తాజాగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు.. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని.. వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నానని.. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని.. హోం క్వారంటైన్లో ఉండాలని కోరారు కిరణ్ రిజిజు. ఇక ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు రోజుకు రెండు లక్షలకు పాగా నమోదవడం అందర్నీ కలవర పరుస్తుంది.


ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటింగ్లకే..కేసీఆర్ పై పొన్నాల విమర్శలు