telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్లు…

beer

తెలంగాణ రాష్ట్రంలో సహజంగానే కాలంతో సమాయంతో సంబంధం లేకుండా మద్యం అమ్మకాలు భారీగా జరుగుతాయి. అయితే అదే ఇంకా ఈ ఎండాకాలంలో అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.  రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో చల్లని పానీయాలవైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతుంటాయి.  గతేడాది మార్చి నెలలో హైదరాబాద్ నగరంలో  26.35 లక్షల బీర్ల కేసులు అమ్ముడైతే, ఈ ఏడాది మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.  మే నెలలో భారీ స్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగే అవకాశం ఉండొచ్చని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటంతో మద్యం దుకాణాలపైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా.. లేదా నేది చూడాలి.

Related posts