telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దొంగ ఓటు వేసిన టీఆర్ఎస్ మున్సిపల్‌ చైర్మన్‌…

voter list

మాములుగా మన దేశంలో జరిగే ఎన్నికలో దొంగ ఓట్లు పడుతాయని విషయం అందరికి తెలుసు. అయితే తాజాగా మన తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా దొంగ ఓటు పడింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే… అధికార పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్ పర్సనే ఆ దొంగ ఓటు వేసింది. దాంతో ఈ విషయం చర్చముషానియంగా మారింది. అయితే విషయం ఏమిటంటే… హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటు హక్కు వేశారు తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాటికొండ స్వప్న. కానీ ఆమె తన తోటికోడలు పేరుతో నమోదైన ఓటును వేశారని.. మున్సిపల్ ఛైర్‌పర్సన్ దొంగ ఓటు వేశారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేరింది. దాంతో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలతో ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణ జరిపి స్వప్న దొంగ ఓటు వేసినట్లు పేర్కొన్నారు. దాంతో ఈ విషయం పై అక్కడ రచ్చ సాగుతుంది. దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. అయితే దీని పై తెరాస పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

Related posts