కరీంనగర్ జిల్లా మానేరు రివర్ ఫ్రంట్ కు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించడం పట్ల కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… సమైక్య పాలనలో కరీంనగర్ జిల్లాతో పాటు గ్రామాలు కూడా అస్తవ్యస్తంగా ఉండేవని… అప్పట్లో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగర్ పట్టణం రూపురేఖలు మారిపోయాయని… మానేరు రివర్ ఫ్రంట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు ప్రకటించడం పట్ల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మానేరు తీరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
							previous post
						
						
					


రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు