telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాగ్-ప్రవీణ్ సత్తారు సినిమా మొదలు…

అక్కినేని నాగార్జున తెలుగు చిత్రసీమలోని ఏకైక గ్రీకు వీరుడు. తనదైన నటనతో పాటు వైవిధ్యమైన కథలతో అందరిని ఆకట్టుకుంటారు. అతడు తాజాగా చేసిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తాజాగా నాగ్ ప్రవీణ్ సత్తారు ఓకే చెప్పారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు గరుడ వేగ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఆ తరువాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎటువంటి సినిమాను తెరకెక్కించలేదు. అయితే తాజాగా నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. దాంతో ఎట్టకేలకు ప్రవీణ్ మళ్లీ రంగంలోకి దిగారు. అయితే వీరిద్దరి కాంబోలో చేస్తున్న సినిమా హిందీ రైడ్ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నప్పటికీ ప్రవీణ్ చేస్తుంది రీమేక్ కాదని, సరికొత్త కథను తెరకెక్కించనున్నారని అంటున్నారు. అంతేకాకుండా ప్రవీణ్ తన తర్వాతి సినిమాను వరుణ్ తేజ్‌ లో చేయనున్నారట. ప్రవీణ్-నాగ్ సినిమాను నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Related posts