సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.
దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జన్మభూమి-2 ను ప్రారంభించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్‍గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం.
అందరి మన్ననలు పొందేలా నామినేటెడ్ పోస్టుల జాబితా, త్వరలోనే పార్టీ సభ్యత్వం ప్రారంభిస్తాం, టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా.
అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది.
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడుతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పార్టీలో పెట్టి చర్చిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని అన్నారు.