నీవు లేని ఈ జీవితం
మాటలు రాని మూగవానిలా
రాయలేని కవిత్వంలా
భావం లేని మనిషిగా
నా హృదయస్పందన ఆగిపోయి
నా నడకలు ఆగిపోయి
నా మస్తిష్కంలోని ఆలోచనలు ఆవిరైపోయి నట్టు
చూపు ఉన్నా గుడ్డివాడిని అయినట్టు
నా ప్రయాణం
నా జీవితం
నా ప్రతి కదలిక ఆగిపోయి
జీవం లేని జీవచ్ఛవంగా
విగతజీవిగా అయ్యి
మౌనంగా రోదిస్తూ ఉన్నాను
ఎన్నటికైనా నువ్వొస్తావని
నీ ప్రేమని పంచుతావని
నీ వొడిలో నాకు చోటిస్తావ ని
నీకై కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నా
మరుజన్మకైనా వస్తావు అన్న ఆశతో