స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి స్టార డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా లక్కీ బ్యూటీ రష్మికా మందన్న కథానాయికగా నటించనుంది. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కతోంది. దీని మొదటి షెడ్యూల్‌ను రాజమెండ్రీ సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో పూర్తి చేసుకున్నారు. తరువాత దురదృష్టవశాత్తు బృందంలో వారికి కరోనా పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ నిలిచింది. అయితే ఈ సినిమాలోని ఐటెం పాట కోసం హాట్ భామను ఎతుకుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్గా కాదు. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో చేయడానికి. దీనికోసం దర్శకనిర్మాతలు బాలీవుడ్ భామ దిశాపటానీని సంప్రదించారని, ఈ ముద్దుగుమ్మ భారీగా పారితోషికం అడుగిందని వార్తలు వస్తున్నాయి. ఈ స్పెషల్ పాటకు దాదాపు రూ.1.5కోట్లు కోరిందట. ఈ బామ హిందీ సినిమా భాగీ3లో ‘డు యు లవ్ మీ’ అంటూ చేసిన డాన్స్‌కు ప్రత్యేక ఫాన్స్ బేస్ ఉంది. దీంతో సుకుమార్ తన సినిమాలోని పాట కోసం ఈ అమ్మడుని కలిసాడు. కానీ ఈ గుమ్మ పారితోషికం ఆకాశాన్నంటుతోంది. మరి ఈ పరిస్థితుల్లో సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి. పలు భాషల్లో పుష్ప విడుదల కానుండటంతో ఈ సినిమాలోకి బాలీవుడ్ నుంచి కూడా ఒకరు ఉండాలని సుకుమార్ ఆలోచించాడు.
previous post