telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 వరల్డ్ కప్ : .. ప్రాక్టీస్ మ్యాచ్ లో .. భారత్ గెలుపు..

2019 world cup India won on bangladesh

ప్రపంచ కప్ సన్నాహక మ్యాచ్ లో భారత్ జట్టు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్ పై 95 పరుగుల తేడా తో విజయం సాధించింది. సన్నాహక మ్యాచ్ లో ప్రత్యర్థి పై సాధికారిక విజయం ద్వారా భారత్ జట్టులో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు నుండి భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పై ఉన్న అనుమానాలు, ఈ మ్యాచ్ ద్వారా దూరమయ్యాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్ (1 ) రోహిత్ శర్మ (19 ) విఫలం కావడం తో మిడిల్ ఆర్డర్ భారం పడింది. కెప్టెన్ కోహ్లీ (47 ) ఫర్వాలేదనిపించాడు. నాల్గవ స్థానం లో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ నిలకడగా ఆడుతూ తాను ఆ స్థానానికి ఖచ్చితంగా సరిపోతానన్న సంకేతాన్ని ఇస్తూ , స్వేచ్ఛ పరుగులు రాబడుతూ 99 బంతుల్లోనే 12 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయం తో 108 పరుగులు సాధించి విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఇక వెటరన్ బ్యాట్స్ మెన్ ధోని కూడా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు.

ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. కేవలం 78 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయం తో 113 పరుగులు నమోదు చేశాడు. చివరిలో ధోని కి జత కలిసిన హార్దిక్ పాండ్యా తన సహజ శైలి కి తగ్గట్టు ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ల చలువ తో భారత్ జట్టు నిర్నీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీలక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు కేవలం 49 .3 ఓవర్లలో264 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. భారత బౌలర్లు బుమ్రా రెండు, కుల్దీప్, చాహల్చేరి మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.

ఎప్పటి మాదిరిగానే సన్నాహక మ్యాచ్ లో భారత జట్టు ను ఓపెనర్ల ఫామ్ లేమి సమస్య వేధించింది. ఈ మ్యాచ్లోను ఇద్దరు ఓపెనర్లు ఆశించిన స్థాయి లో రాణించలేకపోయారు. విజయ్ శంకర్ సైతం కేవలం రెండుపరుగులకే వెనుతిరిగి నిరాశపరిచాడు. ఇక కోహ్లీ ఎప్పటి మాదిరిగానే తనపై అంచనాలకు తగ్గట్టుగారాణించగా, రాహుల్ ఐపీల్ ఫామ్ కొనసాగించగా, ధోని మరోసారి తన తురుపు ముక్కేననినిరూపించుకున్నాడు. బౌలింగ్ విభాగం లో బుమ్రా తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు రాణించగా, స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ఆకట్టుకోవడం విశేషం. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లాండ్ పిచ్ లపై చేరి మూడు వికెట్లు సాధించిసత్తా చాటారు. సన్నాహక మ్యాచ్ లు ముగిసి ప్రధాన టోర్నీ ప్రారంభమవుతున్న నేపధ్యం లో బంగ్లా పై గెలుపుద్వారా భారత్ జట్టు ఆత్మ విశ్వాసం తో టోర్నీ ప్రారంభించనుంది.

Related posts