telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదుఅనుభవం…

vallabhaneni vamsi into ycp soon

సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదుఅనుభవం ఎదురైంది.. గ్రామంలోకి రావొద్దంటూ వంశీని అడ్డుకున్నారు బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామస్తులు.. తమ గ్రామంలో 1400 తెల్ల రేషన్‌ కార్డులు ఉంటే.. 400 మందికి మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు.. వేరే గ్రామాల వారికి తమ ఊరిలో పట్టాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీకి విచ్చేసిన ఎమ్మెల్యే వంశీమోహన్ గో బ్యాక్.. గోబ్యాక్ అంటూ నినాదాలు చేవారు.. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేది ఏమీలేక అలిగి వెనుదిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్యే వంశీ… మరోవైపు.. ఆ గ్రామంలో వైసీపీలో గ్రూపు విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.. వంశీ వర్గం ఓవైపు.. పాత వైసీపీ నేతలు మరోవైపు ఉండగా.. ఇప్పుడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఉన్నవర్గామే ఈ ఆందోళనను ప్రోత్సహించిందని వల్లభనేని వంశీ ఆరోపిస్తున్నారు.. మొత్తంగా గన్నవరం పాలిటిక్స్ మరోసారి గరంగరం మారిపోయాయి. మల్లవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో.. పోలీసులు భారీగా మోహరించారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts