ఏపీలో కలకలం రేపిన స్నేహలత అంశం మీద ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతదని ఆయన అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లి వాపోతోందని ఆయన అన్నారు. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. ఆడ పిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారి పట్ల కంశుడిలా తయారయ్యారని పేర్కొంది. జగన్ జీవితమే ఒక ఫేక్ అని పేర్కొన్న ఆయన చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారని అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదని 19 నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడిబిడ్డలపై వేధింపులు గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు సంఘటనలు జరిగాయన్న ఆయన తండ్రి చనిపోయాడని ఓదార్పు యాత్రలు చేసి సానుభూతి కోసం నానా గడ్డి తినీ ఇప్పుడు బాధితుల్ని పట్టించుకోరా ? అని ప్రశ్నించారు. తండ్రి చనిపోయాడని ఓదార్పు యాత్రలు చేసి సానుభూతి కోసం నానా గడ్డి తినీ ఇప్పుడు ఆడబిడ్డలపై కనికరం లేకుండా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించిన ఆయన వైకాపా అరాచకాలకు అడ్డు అదుపు లేదా అని ప్రశ్నించారు. ఆడపిల్లల మానానికి శీలానికి రక్షణ కల్పించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇదని అన్నారు.