కొరటాల శివ దర్శకత్వంలో ఈ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతుంది. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ చిరంజీవికి జోడిగా నటిస్తుంది. అయితే.. చెర్రీ సరసన నటించే హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మొదట బాలీవుడ్ నటి కియారా అడ్వానీని అనుకున్నారు. కానీ కియారా బిజీగా ఉండటంతో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. అయితే.. ఈ పాత్ర కోసం రష్మికను సంప్రదించగా.. దానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. జనవరి మూడో వారంలో చెర్రీ, రష్మిక షూటింగ్లో కూడా పాల్గొననున్నారని టాక్. కాగా.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫీలిం సిటీలో జరుగుతోంది.