telugu navyamedia
సినిమా వార్తలు

కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విష‌మం-వైద్యులు

సీనియ‌ర్ నటుడు కైకాల సత్యనారాయణ (86) తీవ్ర అస్వస్థతకు గురై గత రెండు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తా జాగా ఆయ‌న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్​ బులిటెన్​ను విడుదల చేశారు వైద్యులు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని అన్నారు.

అయితే కైకాల స్పృహతో ఉన్నారని, అయితే ఇప్పటికీ తక్కువ రక్తపోటు ఉందని, వాసోప్రెసర్ సపోర్ట్ పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్ల‌డించారు. ఈ రోజు కైకాల జిఐ ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదని, కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

దీంతో ఆయన ఆరోగ్యం గురించి సినిమా వర్గాలు కలత చెందుతున్నాయి. నిన్న చిరంజీవి కైకాల ఆరోగ్యం విషయం గురించి డాక్టర్ ను ఆరా తీశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

Related posts