telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇన్‌స్టాలో హల్ చల్ చేస్తున్న శ్రద్ధాదాస్..

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్. అందంతో పాటు అభినయం కూడా ఆమె సొంతం. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ మంచి ఆమెకు అవకాశాలే లభిస్తున్నాయి. తన హాట్ ఫిగర్‌కి అక్కడ అభిమానులను కూడా సంపాదించుకుంది. అయితే ఇప్పుడు అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. అందాలను ఆరబోస్తూ ఇన్‌స్టాగ్రాంలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో అల్లు అర్జున్ చేసిన ఆర్య-2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి వంటి చిత్రాలలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తరువాత ఎందకనో టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె బాలీవుడ్ చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకు దురదృష్టమే తలుపు తట్టింది. దీంతో ప్రస్తుతం మంచి రోల్‌ అనుకుంటే తప్ప సౌత్‌ వైపు చూడడం లేదు. అయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమె తన పంథానే మార్చుకుంది. పాత్ర ఏదైనా సరే.. అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతోంది. ఆమె ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో వెడెక్కిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో శ్రద్ధా రెండు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ రెండు ఫొటోలు బోల్డ్‌‌గా ఉన్నాయి.‌ అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బాలీవుడ్‌లో అవకాశాల కోసం, సినిమా పెద్దలను ఆకర్షించాలని, తద్వారా ఏ పాత్ర అయినా తాను చేస్తాననే నమ్మకం వారికి కలిగించి అవకాశాలు అందుకోవడానికే అలా ఎక్స్‌పోజింగ్‌ చేస్తోందని అంటున్నారు. మరి ఈ హాట్ ఫోటోలు శ్రద్ధకు ఏ మాత్రం ఉపయోగపడతాయో వేచి చూడాలి.

Related posts