telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ది సాధ్యం..

కాంగ్రెస్ , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బంజారాహిల్స్ డివిజ‌న్ లోని ఎన్బీటీ న‌గ‌ర్ లో పాద‌యాత్ర నిర్వ‌హించారు. టీఆర్ఎస్ కార్పోరేట‌ర్ అభ్య‌ర్థి గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, అల్లోల దివ్యారెడ్డితో క‌లిసి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్ర‌మ‌ల‌ను వివ‌రిస్తూ టీఆర్ఎస్ కే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించారు. బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఈసారి కూడా ప్రజలు ఆశీర్వదించి ఆమెను గెలిపించాలని కోరారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై టీఆర్ఎస్ కు ఉన్న ప‌ట్టింపు మరే ఇత‌ర పార్టీల‌కు లేద‌ని చెప్పారు. నీటి ప‌న్ను ర‌ద్దు చేయ‌డంతో పాటు సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకుర్చే నిర్ణ‌యం తీసుకుంతద‌న్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల బూట‌క‌పు మాట‌ల‌ను న‌మ్మే స్థితిలో గ్రేట‌ర్ ప్ర‌జ‌లు లేర‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, ఎంతో మంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా మహా నగరంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

Related posts