భారత్ 2017లో జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరాలో సీఆర్‌పీఎఫ్ స్థావరంపై దాడికి పథక రచన చేసిన జైషే ఉగ్రవాది నిసార్ అహ్మద్ తాంత్రేను యూఏఈలో అదుపులోకి తీసుకుంది. 2017 డిసెంబరు 30, 31 మధ్య సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులు కాగా, ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.
సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై, దక్షిణ కశ్మీర్ జైషే డివిజనల్ కమాండర్ నూర్ తాంత్రే సోదరుడైన నిసార్.. దాడికి పథక రచన చేశాడు. కేవలం నాలుగు అడుగులు మాత్రమే ఉండే నిసార్‌కు జైషేలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దుబాయ్‌లో ఇతడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం ఎన్ఐఏకు అప్పగించారు. నిసార్ సోదరుడు నూర్ 2017లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇటీవలే జైషే ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసి 44 మంది జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రణాళిక వేసిన సూత్రధారి పాక్ లో తలదాచుకున్నట్టు ఆ దేశమే స్పష్టం చేయడం విశేషం. అయితే ఆ ఉగ్రసంస్థ ప్రధాన నాయకుడు మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
ఇళయరాజాపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు